ముగించు

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయము, డి ఆర్ డి ఎ ములుగు

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయము, ములుగు

పత్రికా ప్రకటన

RC.No. : EGS/HR/SALR/0002/2020-AO-MLG MGNREGS,       తేదిః    -03-2021.

          శ్రీయుత కమీషనర్, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ, హైదరాబాద్ గారి ఆదేశముల ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో పని కావాలని కోరే ప్రతి ఒక్కరికి పని కల్పించుటకుగాను, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకములో చేపట్టబడుతున్న పనుల నాణ్యతను మరియు పని దగ్గర పర్యవేక్షణను తగు రీతిలో పెంపొందించుటకు ములుగు జిల్లాలో (05) బేర్ఫుట్ టెక్నిషియన్స్ (సాంకేతిక సహాయకులు) లను నియమించుట కొరకు అర్హత కల్గిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనుటకు కోరనైనది. వీటికి కావల్సిన అర్హత ఇతరత్రా వివరములు ఈ క్రింది విధంగా కలవు.

విద్యార్హతలు:

  1. అభ్యర్థుల కుటుంబం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీపథకము యొక్క జాబ్ కార్డ్ తీసుకోని/పొంది, 2018-19, 2019-20, 2020-21 (నోటిఫికేషన్ జారీ చేయు తేది వరకు) సంవత్సరాలలో కనీసం ఒక రోజు పని చేసియుండాలి.
  2. అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లమా (పాలిటెక్నిక్) లేదా బి.ఇ / బి.టెక్ (సివిల్)

    ఉత్తీర్ణులై ఉండాలి.

  1. ములుగు జిల్లాలోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు.
  2. సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లమా (పాలిటెక్నిక్) లేదా బి.ఇ / బి.టెక్ (సివిల్).
  3. S.S.C. మెమో.
  4. కుల ధృవీకరణ (M R O చే జారీ చేయబడినది).
  5. నివాస ధృవీకరణ (M R O చే జారీ చేయబడినది).
  6. కుటుంబ యాజమాని జాబ్ కార్డు.
  7. పాస్ ఫోటో (కలర్).

ఎంపిక విధానం: 

అభ్యర్థులు నిర్దేశిత విద్యార్హతలలో సాధించిన మార్కుల ఉత్తీర్ణత శాతం(యోగ్యత) మరియు యస్.సి/యస్.టి బేర్ఫుట్ టెక్నిషియన్స్ క్లస్టర్ల మేరకు ఎంపిక చేయబడును. SC, ST మరియు స్త్రీ/మహిళా అభ్యర్దులకు ప్రాధాన్యతగా ఎంపిక చేయబడును. ఎంపీక అయిన అభ్యర్థులకు 90 రోజులు శిక్షణ ఇవ్వబడును.

నెలవారి పారితోషకం:     

కేంద్ర మరియు రాష్ట ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి మార్గదర్శకాల మేరకు ఎంపికైన అభ్యర్థులకు MGNREGS పథకము క్రింద మెటీరియర్ కాంపోనెంట్ యందు నైపుణ్యం కల్గిన కార్మికుడిగా పారితోషకం చెల్లించబడుతుంది.        

దరఖాస్తులు స్వీకరించుటకు మరియు  సమర్పించుటకు చివరి తేదిః  

          తేది:27.03.2021 ఉదయుం 10.30 గం.ల నుండి  తేది: 01.04.2021 సాయంత్రము 5.00 గంటల వరకు (web site address) ఆన్ లైన్ ద్వారా సమర్పించిన దరఖాస్తులు స్వీకరించబడును.

పూర్తి వివరాలకు సంప్రదించండి: HR Manager, 9121238388

దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : 01-04-2021

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి,

 జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ములుగు.